ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్షార్పణం

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్షార్పణం

క్రైస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: భారీ వర్షం వల్ల ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితం తేలకుండానే ముగిసింది. ఒక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయిన తర్వాత మళ్లీ వాన పడటంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధ్యం కాలేదు. 

టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (49 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ధనాధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటతో రెచ్చిపోగా, జోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (29), హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (20), జోర్డాన్​కాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16), జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీథెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15) మోస్తరుగా ఆడారు. మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెన్రీ, జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డఫీ, జెమీసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నీషమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత భారీ వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం 10 గంటల 10 నిమిషాలకు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని తేల్చడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆక్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం జరుగుతుంది.