PBKS vs DC: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈరోజు (మే 11న) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగే పోరు కంటే కూడా, ధర్మశాలలోని అస్థిర వాతావరణం క్రికెట్ అభిమానులను, క్రీడా విశ్లేషకులను తెగ టెన్షన్ పెడుతోంది.
వర్షం పడే అవకాశం?:
ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రత 17°C గా ఉండగా, తేమ (Humidity) 77 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం వేళ చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షం పడగా.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, రాత్రికి వర్షం పడే అవకాశం 35శాతానికి తగ్గుతుందని అంచనా. కాగా ఒకవేళ భారీ వర్షం కురిసినా, HPCA స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మ్యాచ్ కొద్దిగా ఆలస్యమైనా, పూర్తి ఓవర్ల ఆట జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
పిచ్ రిపోర్ట్:
సముద్ర మట్టానికి సుమారు 1457 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ స్టేడియంలో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల బంతి గాలిలో వేగంగా ప్రయాణించి బౌండరీల అవతలికి వెళ్తుంది. 2023 నుంచి ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 209గా ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ పరుగుల వరద పారడం ఖాయమని అర్థమవుతోంది. కొండ ప్రాంతం కావడంతో చల్లని గాలుల వల్ల బంతి ఆరంభంలో బాగా స్వింగ్ అవుతుంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లకు ఇది కలిసివచ్చే అంశం.
టాస్ కీలకం:
సాధారణంగా ఐపీఎల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటుంది. కానీ, ధర్మశాల రికార్డుల ప్రకారం మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాతావరణం:
గత ఏడు రోజులుగా ధర్మశాలలో ఉష్ణోగ్రతలు 12°C నుంచి 28°C మధ్య ఛేంజ్ అవుతుంది. పశ్చిమ విక్షోభాల (Western Disturbances) కారణంగా మే నెలలో ఇక్కడ సాధారణంగానే ఉదయం ఎండగా, సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. రాబోయే 72 గంటల పాటు హిమాచల్ ప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) షిమ్లా హెచ్చరించింది.
Today’s match venue has to be one of the most beautiful stadiums in the world ,Still don’t understand why places like this are not developed more for other big sporting events. Dharamshala already has decent air and road connectivity too.#PBKSvsDC pic.twitter.com/SL10kxA8O8
— Nikhil saini (@iNikhilsaini) May 11, 2026
