బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ మనీ లాండరింగ్ ఉచ్చు రోజురోజుకూ మరింత బిగుస్తోంది. ప్రస్తుతం తీహార్ జైలు ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌తో ముడిపడిన రూ. 200 కోట్ల భారీ దోపిడీ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ కేసులో తాను కేవలం ఒక బాధితురాలినని, అప్రూవర్ గా మారతానని జాక్వెలిన్ కోర్టు మెట్లెక్కింది.
అయితే, కోర్టులోఈ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం (మే 11, 2026) తీవ్రంగా వ్యతిరేకించింది. పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ ఎదుట ఈడీ బలమైన వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంపై మే 12 లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోర్టు జాక్వెలిన్‌ను ఆదేశించింది.
జాక్వెలిన్ అమాయకురాలు కాదు..
కోర్టుకు సమర్పించిన నివేదికలో జాక్వెలిన్ పాత్రపై ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. సుకేశ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్, అతని అసలు రూపం పూర్తిగా తెలిసినప్పటికీ జాక్వెలిన్ అతనితో సంబంధాన్ని కొనసాగించింది . నేరాల ద్వారా సంపాదించిన బ్లాక్ మనీతో కొనుగోలు చేసిన విలాసవంతమైన గిఫ్ట్‌లు, ఖరీదైన వజ్రాలు, విదేశీ ప్రయాణాలు, నగదును జాక్వెలిన్ స్వయంగా అనుభవించడమే కాకుండా.. తన కుటుంబ సభ్యులకు కూడా అందేలా చూసింది. ఆమె అమాయకురాలు కాదని వాదించింది.
దర్యాప్తును పక్కదారి పట్టించేలా....
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐదు సార్లు స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినప్పటికీ, ఆమె ఏనాడూ పూర్తి నిజాలను వెల్లడించలేదు. కొన్ని కీలక నగదు లావాదేవీలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టింది . సమాధానాలు దాటవేస్తూ దర్యాప్తుకు కనీసం సహకరించలేదు అని ఈడీ తన వాదనను గట్టిగా వినిపించింది. ఆమె ఈ కేసులో చిన్న పాత్రదారి కాదు. ఒక కీలక లబ్ధిదారు. కాబట్టి ఆమెను అప్రూవర్ గా మారిస్తే చట్టానికి విలువ ఉండదు అని ఈడీ వాదించింది. .
అపహాస్యమవుతుంది.
అసలు ఏంటీ రూ. 200 కోట్ల కథ?
బిలియనీర్లను టార్గెట్ చేస్తూ ప్రధాని కార్యాలయం (PMO), కేంద్ర హోంశాఖకు చెందిన ఉన్నతాధికారినంటూ నమ్మించి సుకేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సుకేశ్‌తో ప్రేమాయణం నడిపిన జాక్వెలిన్‌కు దాదాపు రూ. 7 కోట్ల విలువైన బహుమతులు లభించినట్లు ఈడీ గుర్తించి ఆమెను నిందితురాలిగా చేర్చింది. అయితే ఈ కేసులో తను బాధితురాలినంటూ.. సేఫ్‌గా బయటపడాలని చూస్తున్న జాక్వెలిన్‌కు ఈడీ వేసిన అడ్డుకట్ట పెద్ద షాక్ అనే చెప్పాలి. కోర్టులో ఈ బాలీవుడ్ గ్లామర్-క్రిమినల్ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..
