వాన నీళ్లు ఇంకేలా..

వాన నీళ్లు ఇంకేలా..

సిటీలో రెయిన్ సెంటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంపుపై యాక్షన్ ప్లాన్

98 క్లస్టర్లలో ఇంజెక్షన్ బోర్ వెల్స్

ఫ్రీ ట్రైనింగ్స్, అవేర్ నెస్ ప్రోగ్రామ్స్

హైదరాబాద్, వెలుగు: సిటీలో వాన నీటి సంరక్షణ, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంపు కోసం రెయిన్ సెంటర్ రానుంది. బ్లూ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యం లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నీటి వృథాను అడ్డుకునేందుకు సోషల్ కమ్యూనిటీస్ ను భాగస్వామ్యం చేస్తూ ఈ సెంటర్ లో అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు. సిటీలో ప్రతి సమ్మర్ లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల అడుగుల లోతుకి గ్రౌండ్ వాటర్ పడిపోతోంది. వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లపైనే ఆధారపడుతుండగా, అందులోనూ 30శాతం వృథా అవుతోంది. మరోవైపు వానలతో లోతట్టు ఏరియాలు, కాలనీలు నీట మునుగుతున్నాయి. వాన నీరంతా డ్రైనేజీలో కలుస్తున్నాయి. వాటిని భూమిలోకి ఇంజెక్ట్ చేసేలా, ఆయా ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్, నీటి లభ్యత, లోతట్టు ఏరియాలు, సమీప ప్రాంతాల్లో వాటర్ బాడీస్ డెవలప్ చేసేలా జల వనరుల పరిరక్షణ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది.

98 క్లస్టర్ల గుర్తింపు..

వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యం లో ఇప్పటికే బ్లూ హైదరాబాద్ క్యాంపె యిన్ నడుస్తోంది. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో 150 డివిజన్లలో నీటి కొరత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ పై స్టడీ చేస్తున్నారు. 98 క్లస్టర్లు గా డివైడ్ చేసి కాలనీల్లో ఇంకుడు గుం తలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ఇంజెక్షన్ బోర్ వెల్స్ నిర్మించనున్నారు. ఒక్కో క్లస్టర్ లో 5–10 ఇంజెక్షన్ బోర్లు నిర ్మించడంతోపాటు, ప్రతి ఇంటి పై పడే వాన నీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా రెయిన్ సెంటర్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలతోపాటు ఇనిస్టి ట్యూట్లు, స్కూళ్లు, కాలేజీల్లో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయనున్నారు.

 

తాగునీళ్లకే రూ. 20 కోట్లు

ఐటీ కారిడార్ జనం లాస్ట్ సమ్మర్ లో వాటర్ బోర్డు ట్యాంకర్లకే రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వెయ్యి చదరపు అడుగుల స్థలంలోని బిల్డింగ్ సర్ఫేజ్ పై రెయినీ సీజన్ లో సుమారు లక్షన్నర లీటర్ల వాన నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ప్రస్తుతం వాన నీరంతా వృథాగా మురికి కాల్వల్లోకి పారుతుంది. ఆ నీటిని భూమిలోకి ఇంజెక్ట్ చేసేలా రెయిన్ సెంటర్ ద్వారా శిక్షణ ఇస్తాం . ప్రజలు, కమ్యూనిటీ, సంస్థల భాగస్వామ్యంతో వృథా నీటిని సంరక్షించు కునేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం.కల్పన రమేశ్ , రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ రూపకర్త.