ప్రభుత్వ స్కూల్లోకి వర్షపు నీరు..టీచర్లే శుభ్రపరిచారు..

ప్రభుత్వ స్కూల్లోకి వర్షపు నీరు..టీచర్లే శుభ్రపరిచారు..

భారీ వర్షానికి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్, చర్ల తిరుమలాపూర్, ఐతోలులోని ప్రభుత్వ పాఠశాలల్లోకి నీరు చేరింది. దీంతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేడిపూర్ స్కూల్లో అటెండర్ లేకపోవడంతో టీచర్లే స్కూల్ను శుభ్రపరిచారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మన ఊరు... మన బడి కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపూర్ స్కూల్లోనే ప్రారంభించారు. అయితే స్కీం పనులు ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని టీచర్లు అంటున్నారు.  వరద నీరు చేరడంతో ఐతోలు  ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఈస్కూల్లోనూ వరద నీటిని టీచర్లే తొలగించారు.