
రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను తెలంగాణ డ్యాముల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాణహితలోకి నీరు వచ్చి చేరడంతో నదిలోని నీటి మట్టం పెరుగుతుంది. కాళేశ్వరం దగ్గర గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. వరద ఉదృతికి నదీ తీరంలోని చలువ పందేర్లు నీళ్లలో మునిగిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వకు అనుగుణంగా తొలి బ్యారేజీ మెడిగడ్డ గేట్లు మూసివేశారు అధికారులు. 85గేట్లకు గానూ 20గేట్టు మూసివేశారు. దీంతో అక్కడ 11,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కర్నెపల్లి పంపుహౌజ్ లో ట్రయల్ రన్ మొదలైంది. దీని నుంచి 13.2 కిలోమీటర్ల పొడవున్న గ్రావిటీ కాలువ ద్వారా నీరు అన్నారం బ్యారేజీకి చేరుతుంది. ప్రసుతం కర్నెపల్లి పంపు హౌజ్ వద్ద నీటి మట్టం 8,600 క్యూ సెక్కుల నీరు ఉండటంతో గ్రావెటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీ లోకి నీటిని మళ్లించి నిలువ చేశారు అధికారులు.