నోట్ చేసుకోండి: మీ ఇల్లు, వీధుల్లోకి పాములు, మొస‌ళ్లు, ఇత‌ర జంతువులు వ‌స్తే.. ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి

నోట్ చేసుకోండి: మీ ఇల్లు, వీధుల్లోకి పాములు, మొస‌ళ్లు, ఇత‌ర జంతువులు వ‌స్తే..  ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి

వర్షాలకు విష సర్పాలు తదితర జీవులు మీ ఇంట్లోకి వస్తున్నాయా.. ఇక మీరేం ఫీకర్​ చేయకండీ..  కింద ఇచ్చిన నంబర్లలో సమస్యను బట్టి సంప్రదించండి మీ సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. 

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నగర శివార్లలోని అనేక ఇళ్లు, కంపెనీలు, కర్మాగారాల్లో పాములు, కొండ చిలువలు కనిపించాయి. తాజాగా నారాయణపేట జిల్లా పసుపుల గ్రామ సమీపంలో కృష్ణా నది ఒడ్డున మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి.

కొన్ని నెలల క్రితం, మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని నివాసితులు ట్యాంక్‌లో మొసళ్ళు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే..  

తెలంగాణ అటవీ శాఖ ఫోన్ నంబర్ 1800 425 5364 లో సంప్రదించి సమస్యను చెప్పాలంటున్నారు అధికారులు. 

పాముల  కనిపిస్తే  8374233366 కి ఫోన్​ చేసి  స్నేక్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీని సంప్రదించవచ్చు.  

ఇతర జంతువుల కనిపిస్తే  యానిమల్ వారియర్స్ సెల్‌ఫోన్ నంబర్ 9697887888లో సంప్రదించాలని అధికారులు వివరించారు.