ఏపీకి మళ్లీ భారీ వర్షాలు.. మూడురోజులు జాగ్రత్త

ఏపీకి మళ్లీ భారీ వర్షాలు.. మూడురోజులు జాగ్రత్త

ఇప్పటికే ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. పదుల సంఖ్య జనం ప్రాణాలు కోల్పోయారు. పశువులు కూడా నీట మునిగి చనిపోయాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మరోమారు ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది. అన్ని చెరువులు, నదులు, వాగులు, వంకల్లో వరద నీరు అలాగే ఉంది. ఇక ఈ వర్షం తోడైతే భారీ వరద సంభవించే అవకాశాలున్నాయి.

దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.  వానలకు ఇబ్బంది పడకుండా నిత్యవసర సరుకులు తెచ్చుకొని ఇంటిలో నిల్వ చేసుకుంటే మంచిది. ముఖ్యమైన పనులు ఉంటే ఈ నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోండి. వరద నుంచి ఉపసమనం ఉండదు. చిన్న వర్షానికే వరద వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త పడండి.​ తమిళనాడు కంటే ఏపీ రాష్ట్రంలోని దక్షిణ భాగాల పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మిగిలిన జిల్లాలు - కర్నూలు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లో మోస్తరు వర్షాలు డిసంబర్ 4, 5 తేదీల్లో పడే అవకాశాలు ఉన్నాయి.