ఎడతెరపి లేకుండా రాష్ట్రమంతా ముసురు

ఎడతెరపి లేకుండా రాష్ట్రమంతా ముసురు

రాష్ట్ర మంతటా మళ్లీ ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి, కష్ణా నదులకు వరద ఉధృతి పెరగింది.  రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి.. మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు వాతావరణ అధికారులు. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.  కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ లో 9.5 సెంటీమీటర్లు, జగిత్యాలలోని కథలాపూర్ లో 8.6, ఆదిలాబాద్ లోని నార్నూల్ లో 8.4, నిజామాబాద్ లోని కమ్మర్ పల్లిలో 8.1 సెంటీమీటర్ల వాన కురిసింది.  హైదరాబాద్ సిటీలో రాత్రంతా వర్షం కురిసింది.