రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన

రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన

రానున్న మూడురోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నాటక సరిహద్దునుంచి కోస్తాంధ్ర వరకు తమిళనా డు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు కాస్త  తగ్గి చలి పెరిగింది. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నిజామాబాద్‌, రామగుండంలో 15 డిగ్రీలు, మెదక్‌లో 15.8 డిగ్రీల రాత్రి ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో గరిష్టంగా 34.2, మహబూబ్‌నగర్‌ 33.5, భద్రాచలం 32, నల్లగొండలో 31డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.