పోర్న్ వీడియోలతో అడ్డంగా సంపాదించాడు

పోర్న్ వీడియోలతో అడ్డంగా సంపాదించాడు
  • రాజ్ కుంద్రాపై 1500 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన ముంబయి పోలీసులు

ముంబయి: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న పోర్న్ వీడియోల ప్రధాన సూత్రధారి రాజ్ కుంద్రానేనని ముంబయి పోలీసులు తేల్చారు. ఈ మేరకు 1500 పేజీల అనుబంధ చార్జిషీట్ ను బుధవారం కోర్టులో  దాఖలు చేశారు. బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా, తన సహచరుడు రేయాన్ థోర్పేతో కలసి సినిమా అవకాశాల కోసం ముంబయి వచ్చే యువతులను వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింల పేరుతో, సినిమా అవకాశాల పేరుతో మోసం చేసి నీచిత్రాలు, పోర్న్ వీడియోలు తీసేవారని పోలీసులు పేర్కొన్నారు. 
ముంబయిలోని కొన్ని ప్రైవేటు గెస్ట్ హౌస్ లలో తీసిన నీలి చిత్రాలను కొన్ని యాప్ ల ద్వారా మార్కెటింగ్ చేసుకుని డబ్బులు భారీగా సంపాదించారని పోలీసులు అభియోగం మోపారు. కేసులో సహ నిందితులైన యశ్ ఠాకూర్ (సింగపూర్), ప్రదీప్ బక్షి (లండన్) లను అరెస్టు  చేయాల్సి ఉందని తెలిపారు. రాజ్ కుంద్రాతోపాటు థోర్పేలను గత జులైనే అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుకున్నారు. బెయిల్ పిటిషన్ పై ముంబయి సెషన్స్ కోర్టులో విచారణ ఇంకా జరుగలేదు.