
టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) ఈ మధ్య తన నుంచి వరుసబెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే పురుషోత్తముడు (Purushottamudu) మూవీతో జూలై 26న థియేటర్స్ ఆడియన్స్ ను పలకరించాడు.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు ఓటీటీలోకి రానుంది.పురుషోత్తముడు మూవీ ‘ఆహా’ (Aha) ఓటీటీ ప్లాట్ఫామ్లో గురువారం (ఆగస్ట్ 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే మరో రెండ్రోజుల్లో స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
ఈ సినిమాపై హీరో రాజ్ తరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ కావడంతో, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అంతేకాదు..పురుషోత్తముడు చిత్రం థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఓటీటీ ఆడియన్స్ ను ఎలా అలరించనుందో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే.
పురుషోత్తముడు రిలీజైన వారం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామీ థియేటర్లలో రిలీజైంది. పురుషోత్తముడు బాటలోనే ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రాజ్‌తరుణ్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ భలే ఉన్నాడు మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.
Get ready to witness the power of Courage !#Purushotamudu premieres on #aha from Aug 29@meramyakrishnan @itsRajTarun @prakashraaj @actorbrahmaji @sribalajivideos @GopiSundarOffl @murlisharma72 pic.twitter.com/RXg4pBsYQJ
— ahavideoin (@ahavideoIN) August 26, 2024
కథేంటంటే?
రచిత రామ్ (రాజ్ తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. అతను భారత్‌లోని గొప్ప బిజినెస్ మెన్స్ లో ఒకరైన పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) తనయుడు. రచిత రామ్ లండన్‌లో చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి (ఇండియాకు) తిరిగి వస్తాడు. రామ్ వచ్చి రరాగానే పీఆర్ గ్రూప్స్ కి అధినేతను చేయాలనీ తండ్రి ఆదిత్య రామ్ డిసైడ్ అవుతాడు.అయితే, తన ఫ్యామిలీ నుంచి ఎవ్వరు సీఈఓ కావాలన్నా అందుకు కంపెనీ నిబంధనలు ఉంటాయని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లి అక్కడి స్థితిగతులు తెలుసుకోవాలని చెబుతుంది.ఇక ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. దీంతో రచిత్ రామ్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు.
అక్కడే ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని పలు విధాలుగా స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. వ్యవసాయం చేసుకుని బతికే భూమి దగ్గరి నుంచి బతికే జీవన విధానం వరకు సమస్యలకు గురి చేస్తుంటారు. దీంతో అక్కడి రైతులు రామ్ సాయం కోరతారు. రాయపులంకకి వెళ్లాక రచిత్ రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఓ సామాన్య రైతు కూలీగా స్టార్ట్ చేసిన కొత్త జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు రచిత్ రామ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్)కు మధ్య చిగురించిన ప్రేమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో సినిమా థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.