రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ : ఆ లవర్ పేరు లావణ్య కాదంట.. అన్విక అంట..!

రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ : ఆ లవర్ పేరు లావణ్య కాదంట.. అన్విక అంట..!

రాజ్ తరుణ్ లావణ్య కేసులో.. సినిమాల్లో చూపించే దానికంటే ఎక్కువ ట్విస్టులు బయటకొస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య కీలక విషయాలు వెల్లడించింది  మాల్వీ మల్హోత్రా తో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసున్నాడని ఆరోపించింది. నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు, టెక్నీకల్ ఏవిడెన్స్ ను అప్పగించింది.  రాజ్ తరుణ్ పై ipc 493 తో పాటు మరి కొన్ని సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

హీరో రాజ్‌ తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని లావణ్య చెప్పింది. కొన్నాళ్ల క్రితం రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ చేయించాడని తెలిపింది. అబార్షన్‌ చేయించిన మెడికల్‌ డాక్యుమెంట్స్‌, ఆస్పత్రి వివరాలు సమర్పించానని చెప్పింది. లావణ్య అలియాస్‌ అన్విక పేరుతో కలిసున్నామన్నారు.

 అన్విక పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసే వెళ్లామని తెలిపింది. మాల్వీ వచ్చిన తర్వాత రాజ్‌ తరుణ్ నన్ను దూరం పెట్టాడని చెప్పింది. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైకు వెళ్లడంతో ప్రశ్నించానంది. రాజ్‌ తరుణ్‌ను నిలదీయడంతో నన్ను దూరం పెట్టాడని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరింది లావణ్య.