నిజాం కాలంలోనే రైతు బిడ్డలకు చదువు అందించిన గొప్ప వ్యక్తి

నిజాం కాలంలోనే రైతు బిడ్డలకు చదువు అందించిన గొప్ప వ్యక్తి
  • భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన గొప్ప మనిషి రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి

హైదరాబాద్: నిజాం కాలంలోనే రైతు బిడ్డలకు చదువును అందించిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అని అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నారాయణగూడలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీలో మరో బాలికల హాస్టల్ కు భూమి పూజ చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన విరాళాలతో పాటు.. ప్రభుత్వం అందించిన 10 కోట్లతో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. 
నిజామాబాద్ జిల్లాలోనే నెంబర్ 1 స్కూలు రాజబహదూర్ వెంకటరామిరెడ్డి స్కూలు అని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 50 ఏళ్ల క్రితం తాను చదువుకునే రోజుల్లో భోజనం కోసం అప్పుడప్పుడు రెడ్డి హాస్టల్ కు వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. అన్ని మౌళిక వసతులతో పిల్లలు బాగా చదువుకోవాలనే ఆకాంక్షతో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి చక్కటి హాస్టల్ ను కట్టించి ఇచ్చారని.. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ ను నిర్మిస్తుండడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు.. సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మికాంత్ రెడ్డి పాల్గొన్నారు.