ఘనంగా రాజరాజేశ్వర స్వామి కల్యాణం

ఘనంగా రాజరాజేశ్వర స్వామి కల్యాణం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణం జరిపారు. అంతకుముందు ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కమిషనర్ దంపతులు. ఆలయం తరుపున ఈఓ దూస రాజేశ్వర్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారి కల్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు కళ్యాణోత్సవానికి భారీగా తరలివచ్చారు. స్వామివార్ల కళ్యాణం ఉన్నందున ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు శ్రీఘ్రదర్శనంను అమలు చేస్తున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ఆలయంలో కోడె మొక్కులను నిలిపివేశారు. ఈ సాయంత్రం శివ పురాణ ప్రవచనాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి హోమం, ఉపాసన, బలిహరణం కార్యక్రమాలను చేపట్టనున్నారు. పెద్ద సేవలో భాగంగా స్వామివారి ఊరేగింపు కొనసాగనుంది. 25న రథ ప్రతిష్ట,  శ్రీ స్వామివారి రథోత్సవం, వసంతోత్సవం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 26న చివరి రోజు పూర్ణహుతి, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.