సంజయ్ దత్‎కు రాజా సాబ్ మూవీ యూనిట్ బర్త్ డే గిఫ్ట్..ఘోస్ట్‌‌గా బయపెడుతోన్న బాలీవుడ్ స్టార్

 సంజయ్ దత్‎కు రాజా సాబ్ మూవీ యూనిట్ బర్త్ డే గిఫ్ట్..ఘోస్ట్‌‌గా బయపెడుతోన్న బాలీవుడ్ స్టార్

 

గత మూడేళ్లుగా సౌత్‌‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌‌ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్‌‌’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మంగళవారం సంజయ్ దత్ 66వ పుట్టినరోజు. ఈ సందర్భంగా విషెస్‌‌ చెబుతూ కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో లాంగ్‌‌ వైట్‌‌ హెయిర్‌‌‌‌, గడ్డం, మీసాలతో ఓల్డ్‌‌ ఏజ్‌‌ గెటప్‌‌, రగ్డ్ లుక్‌‌లో భయపెట్టేలా కనిపిస్తున్నారు సంజయ్ దత్.

ప్రభాస్‌‌కు తాత పాత్రలో ఘోస్ట్‌‌గా ఆయన నటిస్తున్నట్టు తెలుస్తోంది. హీరో ప్రభాస్‌‌ ఈ పోస్టర్‌‌‌‌ను ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేస్తూ సంజూ బాబాతో  కలిసి స్క్రీన్‌‌ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ బర్త్‌‌ డే విషెస్‌‌ తెలియజేశాడు. మాళవిక మోహనన్‌‌, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారర్ కామెడీ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌‌‌‌ 5న విడుదల కానుంది.