అమిత్​ షా సభకు రాజాసింగ్, బాపురావు డుమ్మా

అమిత్​ షా సభకు రాజాసింగ్, బాపురావు డుమ్మా

ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ను ఇటీవలే బీజేపీలో చేరిన నాగేశ్ కు ఇస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ నేతలపై బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజాసింగ్ కూడా సమావేశానికి రాలేదు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 

దేశంలో 400 సీట్లు.. రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్: అమిత్​ షా

హైదరాబాద్​, వెలుగు: మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తంచేశారు. తాను దేశంలోని చాలా రాష్ట్రాలకు వెళ్లానని, ఎక్కడికెళ్లినా మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సారి బీజేపీ కచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు పైగా సీట్లలో బీజేపీని గెలిపించాలని సూచించారు. 75  ఏండ్లు అవుతున్నా రాష్ట్రంలో నిజాం పాలన ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, దాని నుంచి విముక్తి కలగాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​పార్టీలు మజ్లిస్​తో అంటకాగుతున్నాయని తెలిపారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్​ ఎజెండాతోనే పనిచేస్తాయని ఆరోపించారు.