బీజేపీలో చేరే వాళ్లకు టికెట్ల గ్యారంటీ లేదు : రాజాసింగ్

 బీజేపీలో చేరే వాళ్లకు టికెట్ల గ్యారంటీ లేదు : రాజాసింగ్
  • పార్టీలో చేరాలనుకునే వాళ్లు తెలుసుకోండి: రాజాసింగ్ 

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం బీజేపీలో చేరే వాళ్లకు టికెట్లు వస్తాయనే గ్యారెంటీ లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పార్టీలో చేరినప్పుడు ఫస్ట్ సీట్లో ఉంటారని, ఆ తర్వాత లాస్ట్ సీట్లోకి వెళ్తారని ఆయన తెలిపారు. బీజేపీలో చేరాలనుకునే వాళ్లు ముందుగా ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో చర్చించి రావాలని ఆయన సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీలోకి వేరే పార్టీల నుంచి చాలామంది చేరతారనే వార్తలు వస్తున్నాయని, వారందరికీ స్వాగతమని అన్నారు. కానీ, బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు 
గుర్తుపెట్టుకోవాలని, రాసి కూడా పెట్టుకోవాలని సూచించారు.