- రజక సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బస్వరాజు శంకర్
ముషీరాబాద్,వెలుగు: ప్రభుత్వ సంస్థల్లో దుస్తులను శుభ్రం చేసే విధులను వెంటనే రజకులకు కేటాయించాలని, జీవో.102ను అమలు చేయాలని తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బస్వరాజు శంకర్ కోరారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమన్వయ కమిటీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం కొన్నే సంపత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బస్వరాజు శంకర్ మాట్లాడుతూ18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకులను రాష్ట్రంలోనూ చేర్చాలని కోరారు. ఫెడరేషన్ కు రూ. 1000 కోట్ల నిధులు మంజూరు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం నెలకొల్పి వచ్చే జయంతిని ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ భగాయత్ లో రజకుల ఆత్మ గౌరవ భవనానికి 3 ఎకరాల స్థలం, రూ.10 కోట్లను కేటాయించి నిర్మించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రయ్య, ముని మనమరాలు శ్వేత, కమిటీ ప్రతినిధులు కొండూరు సత్యనారాయణ, బాలరాజ్, జయరాం, దుబ్బాక రమేశ్, కుమారస్వామి, బ్రహ్మయ్య, గోపి, మురళి పాల్గొన్నారు.
