ఇలా అయితే ఎలా జక్కన్న.. మేము సినిమా ఎప్పుడు చూడాలి?

ఇలా అయితే ఎలా జక్కన్న.. మేము సినిమా ఎప్పుడు చూడాలి?

తన తరువాతి సినిమాపై రాజమౌళి(Rajamouli) తీసుకున్న డెసిషన్ పై మహేష్(Mahesh babu) ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇలా అయితే సినిమా ఎప్పుడు పూర్తవుతుంది మేము ఎప్పుడు చూస్తామా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహేష్ తో తాను చేయనున్న సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ రెండు పార్ట్స్ కోసం ఏకంగా రూ. 1500 కోట్లు ఖర్చు చేయనున్నాడట. అయితే ఈ సినిమా కోసం ముందు అనుకున్న బడ్జెట్ 800 కోట్లు కాగా.. అదికాస్తా ఇప్పుడు 1500 అయ్యింది. 
     
బాహుబలి(Bahubali) సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సినిమాను కూడా ముందు ఒక పార్ట్ గానే మొదలుపెట్టారు. కథ పెద్దదవడంతో రెండు పార్ట్స్ గా విడుదల చేశారు. దీంతో బడ్జెట్ లో కూడా పెరిగిపోయింది. 
 
ఇక ఇప్పుడు మరోసారి మహేష్ సినిమా కోసం కూడా సేమ్ స్ట్రాటజీని వాడుతున్నాడట జక్కన్న. ఇక 1500 కోట్ల భారీ అమౌంట్ ను తిరిగి రాబట్టాలంటే.. రెండు పార్ట్స్ అయితేనే బెటర్ అని మూవీ టీమ్ కూడా ఫిక్స్ అయ్యిందట. ఈ న్యూస్ తెల్సుకున్న మహేష్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

కేవలం ఒక సినిమాకే దాదాపు 2 నుండి 3 సంవత్సవారాల టైం తీసుకునే రాజమౌళి.. రెండు పార్ట్స్ అంటే కనీసం 5 సంవత్సరాలైనా పడుతుంది. అన్ని సంవత్సరాల వరకు తమ అభిమాన హీరోను చూడకుండా ఉండటం ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ జక్కన్న ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టనున్నాడు. పాన్ వరల్డ్ లెవల్లో రానున్న ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు భారీగా ఉన్నాయి.