
‘బాహుబలి’తో ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను అందించాడు రాజమౌళి. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళి ఏ స్థాయిని అందుకున్నాడో తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ అప్‌కమింగ్ మూవీస్ ప్రమోషన్స్‌లో ఉన్నారు. ఓవైపు‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌కు కొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్న జక్కన్న, మరోవైపు ‘రాధేశ్యామ్’ కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం ఇప్పటికే ప్రకటించారు. దీంతో తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ రాజమౌళి పేరును అనౌన్స్ చేసింది టీమ్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నై, ముంబైలలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓ ఈవెంట్‌కి కూడా రాజమౌళి గెస్ట్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కన్నడ వెర్షన్‌కు శివ రాజ్‌కుమార్, మలయాళ వెర్షన్‌కు పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఇస్తున్నారు.