దర్శకధీరుడు రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా పది పార్ట్స్ గా. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబూతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.
త్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2024 చివరిలో గానీ 2025 ఆరంభంలో గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం తన మైండ్ లో ఉన్న విజువల్స్ తో మహాభారతాన్ని తెరకెక్కించాలంటే కనీసం 10 పార్ట్స్ ఐనా పడుతుందని, ఒక్కో పార్ట్ తెరకెక్కించడానికి కనీసం 4 సంవత్సరాల సమయమైనా పడుతుందని ఆయన తెలిపాడు.
ఇక ఈ న్యూస్ విన్న సినీ జనాలు 10 పార్ట్స్ అంటే అప్పటివరకు యాంక్టర్స్ అయినా ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పది పార్ట్స్ గా రానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు కాదు.. సంవత్సరాలు ఆగాల్సిందే.