ఘనంగా వేములవాడ రాజన్న రథోత్సవం

ఘనంగా వేములవాడ రాజన్న రథోత్సవం

వేములవాడ : రాజన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి రథోత్సవం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవిని, శ్రీ లక్ష్మీసమేత అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అందంగా అలంకరించి రథంపై ఊరేగించారు. రథాన్ని వివిధ రకాలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. డప్పులు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య, నృత్యాలుచేస్తున్న భక్తుల ఆనందపారవశ్యం మధ్య స్వామిని పురవీధుల గుండా ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.