- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాజన్నసిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లకు మంగళవారం ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ రూల్స్‌పై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు అవకాశం ఉండదన్నారు.
నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఎస్ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ట్రైనింగ్ సెషన్‌లో సీపీవో శ్రీనివాసాచారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, మాస్టర్ ట్రెయినర్లు పాల్గొన్నారు.
