క్రికెట్ ఆడేందుకు వెళ్లి.. పిడుగుపాటుతో యువకుడు మృతి

క్రికెట్ ఆడేందుకు వెళ్లి.. పిడుగుపాటుతో యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులో పిడుగు పడి... పడిగె సతీష్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం స్నేహితులతో  కలిసి.. క్రికెట్ ఆడేందుకు గ్రామ శివారులోకి సతీష్ వెళ్లాడు. అదే సమయంలో భారీగా వర్షం రావడంతో...  ఓ చెట్టుకింద సతీశ్ నిలబడ్డాడు. 

ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో స్పాట్ లోనే సతీష్ చనిపోయాడు. సతీష్ మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. మృతుడు మెకానిక్ గా పని చేసేవాడని స్థానికులు చెప్తున్నారు.