రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంజయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంజయ్య

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి మండలం దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య నియమితులయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే సత్యం చేతుల మీదుగా అంజయ్య నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మహేశ్వర్ రెడ్డి, ఏనుగుల కనుకయ్య, వంశీ, ఎల్లేశ్‌‌, వినోద్ పాల్గొన్నారు.