రికార్డుస్థాయిలో రాజన్న వార్షిక ఆదాయం

రికార్డుస్థాయిలో రాజన్న వార్షిక ఆదాయం

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వార్షిక ఆదాయం రూ. 87.78 కోట్లు సమాకూరినట్లు ఆలయ ఆఫీసర్లు ప్రకటించారు. రెండేళ్లకోసారి జరిగే సమక్క -సారలమ్మ జాతర సమయంలో ముందుగా రాజన్నను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న అనవాయితీ. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో స్వామివారికి రూ. 85 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అయినప్పటికీ అంతకు ముందుసారితో పోలిస్తే ఆదాయం పెరిగింది. మొత్తం రూ. 87.78 కోట్లు వచ్చింది. అత్యధికంగా హుండీ కానుకల ద్వారా రూ. 28.34 కోట్లు, కోడె మొక్కుల ద్వారా రూ. 18.28 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 13.86 కోట్లు, అర్జిత సేవల ద్వారా రూ. 6.83 కోట్లు, లీజులు, అద్దెల ద్వారా రూ. 5.35 కోట్లు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ. 2.17 కోట్లు, అద్దె గదుల ద్వారా రూ. 2.71కోట్లు, ఇతరత్రా రూ. 10.24 కోట్ల  ఆదాయం సమకూరింది.