
వేములవాడ, వెలుగు: భక్తులకు సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావించాలని, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. ఆదివారం రాజన్న ఆలయ అనుబంధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రాజన్న గోశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బద్దిపోచమ్మ టెంపుల్, భీమేశ్వరసదన్ వసతి గృహాలను ఈవో తనిఖీ చేశారు.
ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందితో మాట్లాడుతూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, సమయపాలన పాటించాలన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగితే సంబంధింత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గురువయ్యనగర్సమీపంలో ఆలయ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రవణ్ కుమార్, బ్రహ్మనగారి శ్రీనివాస్, జయకుమారి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.