వర్షం పడుతోంది.. నువ్వు నేను బైక్ పైన తిరుగుదాం

V6 Velugu Posted on Oct 16, 2021

ఏడేళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే హైదరాబాదును అభివృద్ధి చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మీరు హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో బాగా మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ ను అన్నారు. అంతేకాకుండా.. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది..  మీరు, నేను ఇద్దరం బైక్ పై నగరంలో తిరుగుదాం అని కేటీఆర్ ను కోరారు. వర్షం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనిద్దరం చూద్దామన్నారు. చిన్న వర్షం వస్తేనే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో కేటీఆర్ కు అర్థమవుతుందన్నారు.

వ్యక్తిగతంగానే హైదరాబాదులో తిరుగుదామని మంత్రి కేటిఆర్ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఇందులో పొలిటికల్ యాంగిల్స్ ఏమీ లేవని రాజాసింగ్ స్పష్టం చేశారు.

 

Tagged Rajasingh, Bike Ride, KTR , rainy areas

Latest Videos

Subscribe Now

More News