
రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాలు గడుస్తున్నా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. మరో రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది.
ఇప్పటికే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డ్ విచారణ పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బోర్డ్ నిర్ణయం పెండింగ్లో ఉందని చెప్పింది. ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు గడువు పొడిగించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.