హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఓల్డ్ సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మంగళవారం ఎమెల్యే రాజాసింగ్‌ను చట్ట ప్రకారమే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. సంయమనంతో ఉండాలని సూచించారు.
