
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీని సమావేశపర్చాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నాలుగో సారి చేసిన ప్రపోజల్ కు గవర్నర్ కల్రాజ్ మిశ్రా బుధవారం రాత్రి ఓకే చె ప్పారు . బుధవారం మధ్యాహ్నం సీఎం గెహ్లాట్ తన ఇంట్లోకేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆగస్టు14 నుంచి అసెంబ్లీసెషన్ ప్రారంభించాలంటూ గవర్నర్కు మరోసారి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయిం చారు. ఈమేరకు గవర్నర్కు కేబినెట్ నాలుగో ప్రపోజల్ పంపింది. గవర్నర్ లేవనెత్తిన 21 రోజుల నోటీస్ పీరియడ్ అప్పటి వరకు పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అంతకుముందు మూడోసారి..
మూడోసారి చేసిన ప్రపోజల్నూ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా తిరస్కరించారు. అసెంబ్లీసెషన్ పెట్టాలంటూ గెహ్లాట్ ఇదివరకేఈ నెల 23, 25 తేదీల్లోరెం డు ప్రపోజల్స్ పంపగా, గవర్నర్ రిజెక్ట్చేశారు. కరోనా వ్యాప్తి సహా 3 అంశాలను గవర్నర్ లేవనెత్తుతూ, కొత్త ప్రపోజల్ పంపాలని గవర్నర్సూచించారు. దీంతో మంగళవారం కేబినెట్ కొత్త ప్రపోజల్ ను పంపగా, దానికీ గవర్నర్ నో చెప్పారు. తన అభ్యంతరాలకు సరైన వివరణ లేదని తిరస్కరించారు. దీంతో బుధవారం సీఎం గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లిగవర్నర్ మిశ్రాను కలిశారు. అంతకుముందు గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ను కలిసి టీతాగేందుకు వెళుతున్నానని చెప్పారు. గవర్నర్ తిప్పిపంపిన ప్రపోజల్ ను ఉద్దేశిస్తూ.. మళ్లీలవ్ లెటర్ వచ్చిందని కామెంట్ చేశారు. ‘‘మీరు ఏం కోరుకుంటున్నారు? మాకుచెప్పండి. మేం అదే పద్ధతిలో నడుచుకుంటాం’’ అని గవర్నర్ ను అడుగుతానన్నారు.
గవర్నర్‌పైచర్యలుతీసుకోవాలి
అసెంబ్లీసమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడంలేదని గవర్నర్‌ను ప్రశ్నించాలని అడ్వకేట్‌సునీల్ కుమార్‌సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెషన్ ప్రారంభించాలంటూ కేబినెట్ తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తిప్పిపంపుతున్నారని అందులో పే ర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్పై కోర్టుఇంకా ఏ నిరయ్ణం తీసుకోలేదు. మూడోసారి కూడా కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ తిప్పి పంపడానికి ముందే సునీల్ కుమార్ సింగ్ ఈ పిటిషన్ వేశారు.