కరోనా బారినపడి బీజేపీ ఎమ్మెల్యే మృతి

కరోనా బారినపడి బీజేపీ ఎమ్మెల్యే మృతి

కరోనావైరస్ బారినపడి రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి (59) మృతిచెందారు. రాజ్‌సమండ్ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరోనా సోకడంతో ఆమె గత కొన్ని రోజుల నుంచి గురుగ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు.

మహేశ్వరి మృతిపట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు సంతాపం తెలిపారు.

‘బీజేపీ నాయకురాలు మరియు రాజ్‌సమండ్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి యొక్క అకాల మరణం గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారులకు నా సంతాపం’ అని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.

‘రాజ్‌సమండ్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి యొక్క అకాల మరణం గురించి విన్నప్పుడు షాక్ అయ్యాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మహేశ్వరి కుటుంబం మొత్తానికి నా ప్రగాడ సంతాపం’ అని అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ట్వీట్ చేశారు.

For More News..

నీ డీజీపీ ఆఫీసుకొస్తా బిడ్డా.. గెలిచే దమ్ములేక దాడి చేస్తున్నరు

ఒక్క టెర్రరిస్టును పట్టించినందుకు 60 మంది రైతుల హతం

ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం