కృష్ణ జింకల వేట: సైఫ్ అలీ ఖాన్, టబును నిర్దోషులుగా రిలీజ్ చేయడంపై ప్రభుత్వం హైకోర్టులో సవాలు

కృష్ణ జింకల వేట: సైఫ్ అలీ ఖాన్, టబును నిర్దోషులుగా రిలీజ్ చేయడంపై ప్రభుత్వం హైకోర్టులో సవాలు

1998 కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా విడుదల చేయడంపై రాజస్థాన్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఇదే వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది.

శుక్రవారం 2025 మే16న జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ కోర్టులో లీవ్-టు-అప్పీల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విషయాన్ని సంబంధిత పెండింగ్ కేసులతో పాటు జాబితా చేయాలని ఆయన ఆదేశించారు.ఈ కేసులో తదుపరి విచారణ జూలై 28కి షెడ్యూల్ వాయిదా వేసింది.

ఇందులో బదిలీ పిటిషన్ అనుమతులు మరియు సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్షకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో చేర్చింది. ఈ లేటెస్ట్ సవాలుతో కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి ఈ బాలీవుడ్‌ నటులు చిక్కుల్లో పడ్డారు. 

ప్రభుత్వ న్యాయవాది మహిపాల్ విష్ణోయ్ ప్రకారం, హమ్ సాథ్-సాథ్ మూవీ షూటింగ్ సమయంలో జోధ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో అక్టోబర్ 1,1998న పలువురు బాలీవుడ్ స్టార్స్ కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొందరిపై కేసులు బుక్ అయ్యాయి.

ఈ విషయంపై ట్రయల్ కోర్టు హీరో సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, అతని సహ నిందితులు - సైఫ్, టబు, నీలం, సోనాలి బింద్రే మరియు దుష్యంత్ సింగ్ లకు తగినంత సాక్ష్యాలు లేకపోవడంతో వీరు నిర్దోషులుగా విడుదలయ్యారు.

అయితే, వీరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సవాలు విసిరింది. దీన్ని స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ప్రస్తుతం సల్మాన్ ఖాన్పై ఉన్న కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.