హనీ ట్రాప్లో చిక్కి.. పాక్కు సైనిక వివరాలు.. రాజస్తాన్కు చెందిన వ్యక్తి అరెస్ట్

హనీ ట్రాప్లో చిక్కి.. పాక్కు సైనిక వివరాలు.. రాజస్తాన్కు చెందిన వ్యక్తి అరెస్ట్

జైపూర్: సోషల్​ మీడియాలో పరిచయమైన ఓ అమ్మాయి వలలో పడి.. మన దేశ రక్షణ రంగ సమాచారాన్ని పాక్​కు చేరవేసిన రాజస్తాన్​కు చెందిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అల్వార్​లో నివాసం ఉండే మంగత్​ సింగ్​కు రెండేండ్ల కింద సోషల్​ మీడియాలో ‘ఇషా శర్మ’ పేరిట గుర్తుతెలియని ఓ అమ్మాయి పరిచయమైంది. మాయమాటలు చెప్పి.. అతడ్ని ఆ యువతి ముగ్గులోకి దింపింది. భారత మిలిటరీకి చెందిన  సమాచారాన్ని మంగత్​ సింగ్​ నుంచి రాబట్టింది. 

అల్వార్ ఆర్మీ కంటోన్మెంట్​తోపాటు పలు ఆర్మీ స్థావరాల లోకేషన్స్​ను ఆమెకు  మంగత్​ సింగ్​ ఆమెకు చేరవేశాడు. ఇందుకోసం డబ్బులు తీసుకున్నాడు. సదరు మహిళ.. పాకిస్తాన్ ఇంటర్నల్​ సర్వీసెస్​ ఇంటెలిజెన్స్​(ఐఏస్​ఐ)కి చెందిన ఉద్యోగిగా  తేలింది. మంగత్​ సింగ్​ను​ అధికారులు శుక్రవారం అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.