ఫిట్​నెస్ కోసం హెల్త్ అకాడమీ పెట్టిన అమ్మాయి

ఫిట్​నెస్ కోసం హెల్త్ అకాడమీ పెట్టిన అమ్మాయి


ఫిట్​గా, హెల్దీగా ఉండాలనుకుంటారు అందరూ. కానీ, డెడికేషన్​ లేక... డైట్​ప్లాన్​, ఫిట్​నెస్​ జర్నీని మధ్యలోనే ఆపేస్తారు చాలామంది. అలాంటివాళ్లకు మోటివేషన్​ ఇచ్చి ఫిట్​నెస్​ రొటీన్​, ఫుడ్​ ప్లాన్​ పాటించేలా చేస్తోంది సొమ్యా లుహాదియా. తను ఒక యంగ్ ఎంట్రప్రెనూర్​.  మహిళలు, అమ్మాయిలు హెల్దీఫుడ్​ తింటూ, ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ‘హెల్త్​ అకాడమీ’​ పెట్టింది. ప్రపంచంలోని టాప్​ ఫిట్​నెస్​ ఇన్​ఫ్లుయెన్సర్లు​, మోటివేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఆమె ఇన్​స్పైరింగ్​ జర్నీ ఇది...

​సొమ్యాది రాజస్తాన్​లోని జైపూర్​. జార్ఖండ్​లోని  రాంచీలో ఉన్న బిర్లా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ యూనివర్సిటీలో బీటెక్​ చదివింది.  అందరిలా జాబ్​ కోసం ట్రై చేయలేదు. తనకెంతో ఇష్టమైన హెల్త్​, ఫిట్​నెస్ రంగంలో ఎంట్రప్రెనూర్​గా సక్సెస్​ అవ్వాలని కలలు కన్నది. ప్రతి ఒక్కరికీ హెల్దీ లైఫ్​స్టయిల్ ​అలవాటు చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఇప్పుడు  రోజూ10 లక్షల మంది మహిళలకి ఫిట్​నెస్​ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది.  ఇంటర్నేషనల్​ స్పోర్ట్స్​ సైన్స్​ అసోసియేషన్​ (ఐఎస్​ఎస్​ఎ) సర్టిఫికెట్​ సాధించింది. ఆ తర్వాత 2017లో సొంత ఊళ్లోనే ‘హెల్త్​ అకాడమీ’ మొదలుపెట్టింది. హెల్త్, ఫిట్​నెస్​ ట్రైనింగ్​ సెషన్స్, కోర్సులు స్టార్ట్​ చేసింది.  ఇప్పుడు ఆ అకాడమీ కోటిన్నర రూపాయల టర్నోవర్​ తెచ్చి పెడుతోంది.
వారం వారం వీడియోలు
సొమ్యా ఫిట్​నెస్​ ట్రైనర్​ మాత్రమే కాదు న్యూట్రిషనిస్ట్, వెయిట్ లాస్​​ మేనేజ్​మెంట్​ స్పెషలిస్ట్​ కూడా. ఆన్​లైన్​ ద్వారా ఎక్కువ మందికి ఫిట్​నెస్​ పాఠాలు చెప్పాలని 2018లో  ‘ది గ్లో గర్ల్స్​ టేల్స్’అనే యూట్యూబ్​ ఛానెల్ పెట్టింది. ఆ ఛానెల్​లో ప్రతి వారం హెల్త్​, ఫిట్​నెస్​, లైఫ్​స్టయిల్​కి సంబంధించిన వీడియోలు పెడుతుంది. సొమ్యా యూట్యూబ్​ ఛానెల్​కి 10 లక్షల మందికి పైగా సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ఆమె ఫిట్​నెస్​ వీడియోల్ని చూశారు. సొమ్యాకి ఇన్​స్టాగ్రామ్​లో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె చెప్పే ఫిట్​నెస్​ పాఠాలకున్న క్రేజ్​ అర్థం చేసుకోవచ్చు. 
ఫిట్​నెస్​ యాప్​
కిందటి ఏడాది ‘జిజిటి ఫిట్​’ అనే ఫిట్​నెస్​ యాప్​ తీసుకొచ్చింది సొమ్య. ఈ యాప్​ని ఇప్పటివరకూ 10వేల మంది మహిళలు ఇన్​స్టాల్​ చేసుకున్నారు. ఇందులో బరువు తగ్గడానికి, బాడీ ట్రాన్స్​ఫర్మేషన్, పొట్ట చుట్టూ కొవ్వు కరగడానికి కోర్సులు చెబుతోంది సొమ్య. కస్టమర్ల ఫిజిక్​కి సరిపోయే వర్కవుట్​ ప్లాన్స్​, ఫుడ్​ ప్లాన్స్​ డిజైన్​ చేస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు వాళ్ల ప్రోగ్రెస్​ని అంచనా వేసి, వాళ్లు అనుకున్న రిజల్ట్ వచ్చేందుకు సాయం చేస్తుంది.   
ఇవి చాలా ముఖ్యం
‘‘మన శరీరంతో మనం అనుబంధం పెంచుకోవాలి. సరైన ఫుడ్ తినాలి. అప్పుడే ఫిట్​నెస్​, హెల్త్​ బాగుంటుంది. సంతోషంగా ఉంటాం కూడా. ఎంత సంపాదిస్తున్నారు? అనే దానికంటే ఎలాంటి ఫుడ్ తింటున్నారు? అనేది చాలా ముఖ్యం. ఏ డ్రెస్​ వేసుకున్నారన్నది కాదు, ఏ ఎక్సర్​సైజులు చేస్తున్నారన్నది పాయింట్​. తిండి, వ్యాయామం...ఈ రెండూ మనల్ని హెల్దీగా, ఫిట్​గా ఉంచుతాయి. నా దగ్గరికి ఫిట్​నెస్​ ట్రైనింగ్​కి వచ్చేవాళ్లకి నేను చెప్పే మొదటి మాట ఇదే” అని చెబుతోంది ఈ యంగ్​ ఎంట్రప్రెనూర్​.