జ్యోతిష్యం: పూర్వాషాడ నక్షత్రంలోకి బుధుడు.. మూడు రాశుల వారు పట్టిందే బంగారం ..

జ్యోతిష్యం:  పూర్వాషాడ నక్షత్రంలోకి బుధుడు.. మూడు రాశుల వారు పట్టిందే బంగారం ..

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా నక్షత్ర రాశుల నుంచి సంచారం చేస్తాయి. మానవ జీవితాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరి ఏడవ తేదీన వ్యాపారాలకు అధిపతి అయిన బుధుడు మూలా నక్షత్రం నుంచి పూర్వాషాడ నక్షత్రం లోకి సంచారం చేయనున్నాడు .

 పూర్వాషాడ నక్షత్రానికి అధిపతి  అయిన  శుక్రుని నక్షత్రం లోకి  బుధుడు వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి ఆస్తి కీర్తి ప్రతిష్టలపరంగా చాలావరకు కలిసి వస్తుంది. అలాగే జీవితాల్లో సానుకూలమైన మార్పులు రావడం కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వ్యాపారాలతో పాటు ఆలోచనలు కూడా ఒక్కసారిగా మారుతాయి. 

తులారాశి :  బుధుడు.. శుక్రుని నక్షత్రం పూర్వాషాడ నక్షత్రంలోకి  వెళ్లడంతో  ఈ రాశి  జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.వీరి  పనులలోను, వ్యాపారాలను పురోగతిని చూస్తారు. ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాలు చేసే వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి .పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయోజనకరమైన మార్పులు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి.

మిధున రాశి :  బుధుడి రాశి మార్పు ఈ రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది.  ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త  ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రయోజనాలను కూడా చూస్తారు. కొత్త వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

►ALSO READ | ఆధ్యాత్మికం : పండుగలకు .. ప్రకృతికి సంబంధం ఇదే.. మకరసంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం..!

ధనుస్సు రాశి :  ఈ  రాశి వారికి బుధుడి నక్షత్రం  మార్పు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. సామాజిక ప్రతిష్ట, పేరు పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. కొత్త  పెట్టుబడుల వలన ఆదాయం బాగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల నుండి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లలతో సంబంధాలు బలపడతాయి. విద్యలో విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.