సంజు సామ్సన్ సెంచరీ వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

సంజు సామ్సన్ సెంచరీ వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ టార్గెట్‌‌ 222  రన్స్‌‌. ఛేజింగ్‌‌లో  స్కోరుబోర్డుపై పరుగైనా చేరకుండానే బెన్‌‌ స్టోక్స్‌‌ ఔటయ్యాడు..! 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది..! ఇలాంటి టైమ్‌‌లో రాయల్స్‌‌ కొత్త కెప్టెన్‌‌ సంజు శాంసన్‌‌ (63 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119) చెలరేగిపోయాడు..! వచ్చిన బాల్‌‌ను వచ్చినట్టు బౌండ్రీలైన్‌‌ దాటించాడు..! ప్రత్యర్థి బౌలింగ్‌‌ను ఊచకోత కోస్తూ  ఫోర్లు, సిక్సర్ల వర్షంతో వాంఖడే స్టేడియాన్ని తడిపేశాడు.!  యంగ్‌‌స్టర్స్‌‌ శివం దూబే, రియాన్‌‌ పరాగ్‌‌ సపోర్ట్‌‌తో  టార్గెట్‌‌ కరిగిస్తూ.. 53 బాల్స్‌‌లోనే సెంచరీ కొట్టేసి టీమ్‌‌ను విజయానికి చేరువ చేశాడు..!  చివరి  మూడు బాల్స్‌‌లో 12 రన్స్‌‌ అవసరం అవగా.. కవర్స్‌‌ మీదుగా సిక్స్‌‌ కొట్టాడు..! ఇంకో రెండు బాల్స్‌‌లో ఐదు చేస్తే రాయల్స్‌‌దే విక్టరీ..! తర్వాతి బాల్‌‌ను లాంగాఫ్‌‌ మీదుగా ఆడిన శాంసన్‌‌ డబుల్‌‌ వచ్చే చాన్స్‌‌ ఉన్నా..  సగం పిచ్‌‌ దాటొచ్చిన క్రిస్‌‌ మోరిస్‌‌ను వెనక్కు పంపించాడు..! మిగిలింది ఒకే బాల్‌‌.. సిక్స్‌‌ కొడితే రాయల్స్‌‌ గెలుస్తుంది.. ఫోర్‌‌ వస్తే  మ్యాచ్‌‌ టై అవుతుంది..! అర్ష్‌‌దీప్‌‌ వేసిన ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను శాంసన్‌‌ కవర్స్‌‌ మీదుగా గాల్లోకి లేపాడు..!  కానీ, లైన్‌‌ దాటని బాల్‌‌ హుడా చేతికి క్యాచ్‌‌గా వెళ్లింది..! అంతే, రాజస్తాన్‌‌ విజయానికి దూరమవగా.. పంజాబ్‌‌ కింగ్స్‌‌ థ్రిల్లింగ్‌‌ విక్టరీ సాధించింది..!  సీజన్‌‌లో ఫస్ట్‌‌ సెంచరీతో సూపర్​ హిట్​ అయిన శాంసన్‌‌ టీమ్‌‌ను గెలిపించలేకపోయాడు. 

ముంబై:కొత్త పేరుతో బరిలోకి దిగిన పంజాబ్‌‌ కింగ్స్‌‌ ఐపీఎల్‌‌ 14లో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే పంజా విసిరింది. లాస్ట్‌‌ బాల్‌‌కు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో భారీ టార్గెట్‌‌ను డిఫెండ్‌‌ చేసుకుంది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన హై స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ 4 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌‌ చేసిన కింగ్స్‌‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్‌‌ చేసింది.  లాస్ట్‌‌ సీజన్‌‌ ఫామ్‌‌ను కంటిన్యూ చేస్తూ కెప్టెన్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ (50 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91) చెలరేగి ఆడగా.. యూనివర్స్‌‌ బాస్‌‌ క్రిస్‌‌ గేల్‌‌(28 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) కూడా ధనాధన్‌‌ షాట్లతో అలరించాడు. ఈ ఇద్దరినీ మరిపించేలా యంగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌  దీపక్‌‌ హుడా (28 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) సిక్సర్ల వర్షంతో రెచ్చిపోయాడు. అనంతరం ఛేజింగ్‌‌లో రాయల్స్‌‌ 20 ఓవర్లలో 217/7 స్కోరు చేసి ఓడిపోయింది. పంజాబ్‌‌ బౌలర్లలో అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (3/35) మూడు, షమీ (2/33) రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. శాంసన్​కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

ధనాధన్‌‌ ఫటాఫట్‌‌

పంజాబ్‌‌ ఇన్నింగ్స్‌‌ స్టార్టింగ్‌‌కు ఎండింగ్‌‌కు పొంతనే లేదు. ఇన్నింగ్స్‌‌ మూడో ఓవర్లో ఆ టీమ్‌‌కు షాక్‌‌ తగిలింది.  రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ (14)ను యంగ్‌‌ పేసర్‌‌ చేతన్‌‌ సకారియా వెనక్కు పంపాడు. మరో ఓపెనర్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌, వన్‌‌డౌన్‌‌లో వచ్చిన క్రిస్‌‌ గేల్‌‌ క్రీజులో కుదురుకునేందుకు టైమ్‌‌ తీసుకోవడంతో  పవర్‌‌ ప్లేలో పంజాబ్‌‌ 46/1తో నిలిచింది. ఆ తర్వాతే కింగ్స్‌‌ అసలు ఆట మొదలైంది. పవర్‌‌ప్లే తర్వాత బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్‌‌ గోపాల్‌‌కు రాహుల్‌‌,  గేల్‌‌ చెరో ఫోర్‌‌తో స్వాగతం పలికారు. తర్వాత స్టోక్స్‌‌ బౌలింగ్‌‌లో రాహుల్‌‌ బౌండ్రీ కొట్టగా.. గేల్‌‌ సిక్స్‌‌ రాబట్టాడు. తెవాటియా ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన యూనివర్స్‌‌ బాస్‌‌ టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. ఈ టైమ్‌‌లో పదో ఓవర్లో పార్ట్‌‌టైం బౌలర్‌‌గా వచ్చిన రియాన్‌‌ పరాగ్‌‌ మ్యాజిక్‌‌ చేశాడు. కేదార్‌‌ జాదవ్‌‌ స్టయిల్లో ఓ బాల్‌‌ వేసిన అతను తర్వాత ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా ఆఫ్‌‌ బ్రేక్‌‌ బాల్‌‌కు  గేల్‌‌ లాఫ్ట్‌‌ షాట్‌‌ ఆడగా స్టోక్స్‌‌ లాంగాన్‌‌లో రన్నింగ్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. అయితే, ఈ ఆనందం రాయల్స్‌‌కు ఎంతో సేపు నిలవలేదు. జోరు కొనసాగించిన రాహుల్‌‌ 30 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన దీపక్‌‌ హుడా విధ్వంసం సృష్టించాడు. దూబే బౌలింగ్‌‌లో  రెండు సిక్సర్లు కొట్టిన హుడా.. గోపాల్‌‌ వేసిన 14వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లతో మరింత రెచ్చిపోయాడు. ఆపై, మోరిస్‌‌ వేసిన 17వ ఓవర్లో మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా ఇంకో భారీ సిక్స్‌‌ కొట్టాడు. 20 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ యంగ్‌‌స్టర్‌‌ సకారియ వేసిన తర్వాతి ఓవర్లో  హ్యాట్రిక్‌‌ ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌‌లో మోరిస్‌‌ బౌలింగ్‌‌లో  క్లాసిక్‌‌ స్కూప్‌‌ షాట్‌‌తో సిక్స్‌‌ కొట్టిన రాహుల్‌‌ స్కోరు 200 దాటించి  మళ్లీ వేగం పెంచాడు. ఇద్దరి జోరు చూస్తుంటే పంజాబ్‌‌ 250 రన్స్‌‌ చేసేలా కనిపించింది.  అయితే, మరో భారీ షాట్‌‌కు ట్రై చేసిన హుడా.. లాంగాన్‌‌లో పరాగ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. దాంతో, ఫోర్త్‌‌ వికెట్‌‌కు 105 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి బాల్‌‌నే రాహుల్‌‌ డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా సిక్స్‌‌ కొట్టినా.. ఆ ఓవర్ లాస్ట్‌‌ డెలివరీకి సకారియ పట్టిన డైవింగ్‌‌ క్యాచ్‌‌కు నికోలస్‌‌ పూరన్‌‌ (0) డకౌటయ్యాడు. 19వ ఓవర్లో రాహుల్‌‌, షారుక్‌‌ ఖాన్‌‌ (6 నాటౌట్‌‌) చెరో ఫోర్‌‌తో 15 రన్స్‌‌ పిండుకున్నారు. కానీ, చివరి ఓవర్లో  లోకేశ్‌‌, జే రిచర్డ్‌‌సన్‌‌ (0) వికెట్లు తీసిన సకారియా ఐదు రన్సే ఇచ్చాడు. అయినా పంజాబ్‌‌ భారీ స్కోరే చేసింది. 

శాంసన్‌‌ ఒక్కడే

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన స్టార్‌‌ ప్లేయర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ (0) డకౌటయ్యాడు.  షమీ వేసిన ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కే పుల్‌‌ షాట్‌‌ ఆడి రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇవ్వడంతో రాయల్స్​కు షాక్​ తగిలింది. కాసేపటికే  అర్ష్‌‌దీప్‌‌ పట్టిన రిటర్న్‌‌ క్యాచ్‌‌కు వన్‌‌డౌన్‌‌ ప్లేయర్‌‌ మనన్‌‌ వోహ్రా (12) వెనుదిరిగాడు. అదే ఓవర్లో శాంసన్‌‌ ఇచ్చిన సింపుల్‌‌ క్యాచ్‌‌ను కీపర్‌‌ రాహుల్‌‌ వదిలేశాడు. అప్పటికి 12 రన్స్‌‌ వద్ద ఉన్న సంజూ ఈ చాన్స్‌‌ను ఒడిసిపట్టుకున్నాడు. మెరిడిత్‌‌ వేసిన ఐదో ఓవర్లో బట్లర్‌‌ (25) వరుసగా నాలుగు ఫోర్లతో  ఇన్నింగ్స్‌‌కు ఊపు తేగా.. శాంసన్‌‌ క్లాసిక్‌‌ షాట్లతో వరుసగా బౌండ్రీలు కొట్టాడు. ఈజీగా సిక్సర్లు కొట్టిన అతను పక్కా టైమింగ్‌‌తో గ్యాప్స్‌‌ మీదుగా బౌండ్రీలు రాబడుతూ టార్గెట్‌‌ కరిగించాడు.  ఎనిమిదో ఓవర్లో క్లాసిక్‌‌ స్లో బాల్‌‌తో బట్లర్‌‌ను రిచర్డ్‌‌సన్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ చేసినా  ఏమాత్రం వెనక్కుతగ్గని శాంసన్‌‌.. శివం దూబే (23) తో కలిసి జోరు కొనసాగించాడు. తొమ్మిదో ఓవర్లో మరో లైఫ్‌‌ దక్కగా 33 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ దాటాడు. మరో ఎండ్‌‌లో దూకుడుగా ఆడుతున్న దూబేను  వెనక్కుపంపిన అర్ష్‌‌దీప్‌‌ పంజాబ్‌‌కు బ్రేక్‌‌ ఇచ్చాడు. కానీ, అప్పటికే జోరు మీదున్న శాంసన్‌‌కు మరో యంగ్‌‌స్టర్‌‌ రియాన్‌‌ పరాగ్‌‌ (11 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 25) తోడయ్యాడు. ఫస్ట్‌‌ బాల్‌‌నే బౌండ్రీకి పంపిన పరాగ్‌‌... షమీ బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టాడు. తర్వాతి ఓవర్లో శాంసన్‌‌ 4,6 బాదడంతో మ్యాచ్‌‌ రాయల్స్‌‌ వైపు మొగ్గింది. ఆపై, మురుగన్‌‌ వేసిన 16వ ఓవర్లో  సంజు ఒక సిక్స్‌‌, పరాగ్‌‌ రెండు సిక్సర్లు బాదడంతో 20 రన్స్‌‌ వచ్చాయి. దాంతో, రాయల్స్​ గెలుపు లెక్క 24 బాల్స్‌‌లో 48 రన్స్‌‌గా మారింది. ఈ టైమ్‌‌లో ఓ బౌన్సర్‌‌తో  పరాగ్‌‌ను ఔట్‌‌ చేసిన షమీ పంజాబ్‌‌ను మళ్లీ రేసులోకి తీసుకొచ్చాడు. అయితే, రిచర్డ్‌‌సన్‌‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 4,6,4 కొట్టి 53 బాల్స్‌‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్న సంజు రాయల్స్‌‌ను గెలిపించిన పని చేశాడు. కానీ, చివరి ఓవర్లో 13 రన్స్‌‌ అవసరం అవగా నాలుగో బాల్‌‌కు సిక్స్‌‌ కొట్టిన శాంసన్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు ఔటవడంతో రాయల్స్‌‌కు ఓటమి తప్పలేదు. 

పంజాబ్‌‌ కింగ్స్‌‌:  రాహుల్‌‌ (సి) తెవాటియా (బి) సకారియా 91, మయాంక్‌‌ అగర్వాల్​(సి) సంజు శాంసన్‌‌ (బి) సకారియా 14, గేల్‌‌ (సి) స్టోక్స్‌‌ (బి) పరాగ్‌‌ 40,  దీపక్​ హుడా (సి) పరాగ్‌‌ (బి)  మోరిస్‌‌ 64, పూరన్‌‌ (సి) సకారియా (బి) మోరిస్‌‌ 0, షారుక్‌‌ (నాటౌట్‌‌) 6, రిచర్డ్‌‌సన్‌‌ (సి) మోరిస్‌‌ (బి) సకారియా 0; ఎక్స్‌‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 221/6;  వికెట్ల పతనం: 1–22, 3–89, 3–194, 4–201, 5–220, 6–221. బౌలింగ్‌‌: సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్‌‌ 4–0–45–0, క్రిస్‌‌ మోరిస్‌‌ 4–0–41–2, గోపాల్‌‌ 3–0–40–0, స్టోక్స్‌‌ 1–0–12–0,  తెవాటియా 2–0–25–0, పరాగ్‌‌ 1–0–7–1, దూబే 1–0–20–0.

రాజస్తాన్‌‌: స్టోక్స్‌‌ (సి అండ్‌‌ బి) షమీ 0, వోహ్రా (సి అండ్‌‌ బి)  అర్ష్‌‌దీప్‌‌12, సంజు శాంసన్‌‌ (సి) హుడా (బి) అర్ష్‌‌దీప్‌‌ 119, బట్లర్‌‌ (బి) రిచర్డ్‌‌సన్‌‌ 25, శివం దూబే (సి) దీపక్​ హుడా (బి) అర్ష్‌‌దీప్‌‌ 23, పరాగ్‌‌ (సి) రాహుల్‌‌ (బి) షమీ 25, తెవాటియా (సి) రాహుల్‌‌ (బి) మెరిడిత్‌‌ 2, మోరిస్‌‌ (నాటౌట్‌‌) 2; ఎక్స్‌‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 217/7; వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217;  బౌలింగ్‌‌: షమీ 4–0–33–2, జే రిచర్డ్‌‌సన్‌‌ 4–0–55–1, అర్ష్‌‌దీప్‌‌ 4–0–35–3, రిలీ మెరిడిత్‌‌ 4–0–49–1, మురుగన్‌‌ అశ్విన్​ 4–0–43–0.