Rajat Patidar: లైఫ్ టైం లక్ అంటే వీరిద్దరిదే.. కోహ్లీ, డివిలియర్స్‌తో ఫోన్ మాట్లాడిన కిరాణా కొట్టు కుర్రాళ్ళు

Rajat Patidar: లైఫ్ టైం లక్ అంటే వీరిద్దరిదే.. కోహ్లీ, డివిలియర్స్‌తో ఫోన్ మాట్లాడిన కిరాణా కొట్టు కుర్రాళ్ళు

అంతర్జాతీయ క్రికెటర్లను గ్రౌండ్ లో చూడడం ఫ్యాన్స్ కు ఒక కల. వారిని కలిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఇక వారితో ఫోటోలు తీసుకుంటే జన్మ ధన్యమైనదని భావిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఎవరో ఒక సాధారణ వ్యక్తి ఏకంగా కోహ్లీ, డివిలియర్స్ లాంటి స్టార్ క్రికెటర్లతో ఫోన్ లో మాట్లాడితే ఆ అనుభవం ఎలా ఉంటుంది. అలాంటి అదృష్టం 21 ఏళ్ళ యువకుడికి కలిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా దేవ్‌భోగ్‌లో ఈ ఊహించని సంఘటన సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందో.. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..     

జూన్ 28న అంటే 12 రోజుల క్రితం మనీష్ అనే 21 ఏళ్ళ కుర్రాడు కిరాణా షాప్ తో తన జీవితం కొనసాగిస్తున్నాడు. అతనికి దగ్గరలో ఉన్న ఒక మొబైల్ షాప్ లో కొత్త రిలయన్స్ జియో సిమ్‌ తీసుకున్నాడు. సిమ్ యాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ క్రియేట్ చేయగానే బిగ్ షాక్. వాట్సాప్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ప్రొఫైల్ పిక్చర్‌ కనిపించింది. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకున్న వారికి కాసేపటికే ఊహించని సీన్ ఎదురైంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి ఆ కుర్రాడికి కాల్స్ వచ్చాయి. పాటిదార్ పాత మొబైల్ నంబర్ 90 రోజుల పాటు ఇన్ ఆక్టివ్ లో ఉంది. దీంతో టెలికాం ప్రొవైడర్ ఈ సిమ్ ను డీ ఆక్టివ్ చేసిన తర్వాత మనీష్ అనే కుర్రాడు ఆ సిమ్ ను కొనుగోలు చేశాడు.          

సహజంగా ఎవరైనా కోహ్లీ, డివిలియర్స్ ఫోన్ అంటే ఎవరైనా అబద్ధం అనుకుంటారు. మనీష్ అతని ఫ్రెండ్ ఖేమ్ రాజ్ కూడా అంతే అనుకున్నాడు. ఎవరో తన ఫ్రెండ్స్ ప్రాంక్ చేసి తనని ఆటపట్టిస్తున్నారని లైట్ తీసుకున్నాడు. అలా కాల్స్ వచ్చినప్పుడల్లా మనీష్.. తనకు తాను మహేంద్ర సింగ్ ధోనీ” అని పరిచయం చేసుకుని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. జూలై 15న మనీష్‌కు ఏకంగా రజత్ పటిదార్ నుంచి కాల్ వచ్చింది. నంబర్ తనదే అని దయచేసి దాన్ని తిరిగి ఇచ్చేయండి అని చెప్పాడు. అది కూడా అబద్ధం అని భావించిన మనీష్ జోక్ అనుకుని తాను ధోనీ అని సంధానమిచ్చాడు. దీంతో పోలీసులను పంపుతాను అంటూ పాటిదార్ హెచ్చరించాడు.

కొంత సమయం తర్వాత పోలీసులు మనీష్ ఇంటికి చేరుకోవడంతో నిజంగానే పాటిదార్‌తో తాము మాట్లాడుతున్నామని వారికి అర్ధమైంది.   వెంటనే ఇద్దరూ సిమ్‌ను తిరిగి ఇచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయిన మనీష్, ఖేమ్‌రాజ్‌కు ఎగిరి గంతేశారు. అనుకోకుండా వచ్చిన ఈ కాల్స్ అతని జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలు అని సంబరపడ్డారు. కోహ్లీతో మాట్లాడినంధుకు జీవిత లక్ష్యం నెరవేరింది అంటూ మరిసిపోయారు.