డాక్ట‌ర్ కిడ్నాప్ కేసులో ఏడుగురు అరెస్టు.. భార్య బంధువే ప్ర‌ధాన నిందితుడు

డాక్ట‌ర్ కిడ్నాప్ కేసులో ఏడుగురు అరెస్టు.. భార్య బంధువే ప్ర‌ధాన నిందితుడు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు. కిడ్నాప్ కు పాల్ప‌డ్డ‌ ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. సీపీ సజ్జనార్ ఈ కిడ్నాప్ కేసు వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డిస్తూ.. కిడ్నాప్ కు ప్లాన్ చెసిన ప్రధాన సూత్రధారి ముస్తఫా.. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువని తెలిపారు . ఆస్ట్రేలియాలో వ్యాపారం చేసి ఆర్థికంగా న‌ష్ట‌పోయిన ముస్త‌ఫా ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తరువాత హైదరాబాద్, పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడని..ఇతనికి ఖలీద్ అనే మ‌రో పార్టనర్ గా కలిశాడని పేర్కొన్నారు.

వారిద్ద‌రు విలాసవంతమైన జీవితానికి అలవాటు ప‌డి.. డ‌బ్బు కోసం డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్‌కు స్కెచ్ వేశార‌న్నారు. మ‌రికొంద‌రి స‌హాయంతో ప్లాన్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కిడ్నాప్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశార‌న్నారు. డాక్ట‌ర్ కిడ్నాప్ కు గుర‌య్యాడ‌న్న ఫిర్యాదుతో మొత్తం 12 టీమ్ లు రంగం లో కి దిగి 12 గంటల్లో సెన్షషనల్ కిడ్నాప్ కేస్ ను ట్రేస్ చేశామన్నారు సీపీ సజ్జనార్. ముస్తఫా, ఖలీద్ లు ఇద్దరు ఫైనాన్షియల్ సలహాదారులుగా పని చేస్తున్నారని.. అందుకోసమే బిట్ కాయిన్ రూపంలో డబ్బులు డిమాండ్ చేశారన్నారు.