Gold Rate: శనివారం తగ్గిన గోల్డ్.. కరీంనగర్-నిజామాబాద్ ఇవాళ్టి రేట్లివే..

Gold Rate: శనివారం తగ్గిన గోల్డ్.. కరీంనగర్-నిజామాబాద్ ఇవాళ్టి రేట్లివే..

Gold Price Today: అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ చర్చల్లో ఎలాంటి పురోగతి దొకరనప్పటికీ నేడు స్వల్పంగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా సెప్టెంబరులో వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించొచ్చనే అంచనాలు గోల్డ్ పెట్టుబడిదారులను క్రిప్టోలు సహా ఇతర మార్గాలను అన్వేషించేలా చేస్తోంది తమ పెట్టుబడుల కోసం. దీంతో క్రమంగా గోల్డ్ రేట్లు వారం రోజులుగా తగ్గుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తగ్గిన రేట్లను గమనించటం ముఖ్యం. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 15తో పోల్చితే నేడు 10 గ్రాములకు రూ.60 స్వల్ప తగ్గుదలను ఆగస్టు 16న నమోదు చేసింది. దీంతో గ్రాముకు కేవలం రూ.6 మాత్రమే ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు హైదరాబాదులో రూ.10వేల 118, కరీంనగర్ లో రూ.10వేల 118, ఖమ్మంలో రూ.10వేల 118, నిజామాబాదులో రూ.10వేల 118, వరంగల్ లో రూ.10వేల 118, విజయవాడలో రూ.10వేల 118, నెల్లూరులో రూ.10వేల 118, కడపలో రూ.10వేల 118, తిరుపతిలో రూ.10వేల 118, విశాఖలో రూ.10వేల 118, అనంతపురంలో రూ.10వేల 118గా కొనసాగుతున్నాయి. 

ALSO READ : శుక్రవారం తగ్గిన గోల్డ్..

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 15తో పోల్చితే ఇవాళ(ఆగస్టు 16)న 10 గ్రాములకు రూ.50 తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు కేవలం రూ.5 మాత్రమే క్షీణించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లు గ్రాముకు పరిశీలిస్తే.. హైదరాబాదులో రూ.9వేల 275, కరీంనగర్ లో రూ.9వేల 275, ఖమ్మంలో రూ.9వేల 275, నిజామాబాదులో రూ.9వేల 275, వరంగల్ లో రూ.9వేల 275, విజయవాడలో రూ.9వేల 275, నెల్లూరులో రూ.9వేల 275, కడపలో రూ.9వేల 275, తిరుపతిలో రూ.9వేల 275, విశాఖలో రూ.9వేల 275, అనంతపురంలో రూ.9వేల 275గా ఉన్నాయి.

ఇక స్వచ్ఛమైన వెండి రేటు ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవంతో పోల్చితే కేజీకి రూ.100 పెరిగింది. దీంతో ఇవాళ కేజీ వెండి రేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల 200 వద్ద గరిష్ఠాల వద్ద కొనసాగుతోంది. ఇక గ్రాము రేటు రూ.126.20గా విక్రయించబడుతోంది.