
భారత ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' చొరవ, ఆపిల్ ఫోన్ల తయారీ ఇండియాకి మార్చడం, సుంకాల పెరుగుదల మధ్య భారతదేశం చైనాను అధిగమించి అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను సప్లయ్ చేసే ప్రముఖ దేశంగా అవతరించింది.
భారతదేశంపై అమెరికా సుంకాలను పెంచడం వల్ల విక్రేతలు ఫ్రంట్-లోడ్ ఇన్వెంటరీకి దారితీసిందని, అంటే సాధారణంగా కంటే చాలా ఎక్కువ కొనుగోలు చేయడం, తయారీ ప్లాన్స్ మార్చడం అని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా 2017 నుండి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మద్దతు, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కారణంగా ప్రపంచ వాల్యూ చైన్ (GVCలు) భారతదేశ విజయానికి దారితీసింది.
"మేడ్-ఇన్-ఇండియా" స్మార్ట్‌ఫోన్‌ల తయారీ మొత్తం సంవత్సరానికి 240 శాతం పెరిగింది. ఆపిల్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో దాదాపు 44 శాతం వాటా భారతదేశం నుండి ఉంది, అయితే గత సంవత్సరం 13 శాతంగా ఉంది. అమెరికాకు చేసే స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో చైనా వాటా 25 శాతానికి పడిపోయింది. కానీ 2024లో అమెరికాకు ఎగుమతి చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో చైనా వాటా మాత్రం 61 శాతంగా ఉంది.
►ALSO READ | రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై.. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఆఫీస్ వర్క్ వరకు అంతా ఫ్రీ !
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతిదారిగా ఉంది, అలాగే CY2024లో 2 వేల కోట్లకి పైగా ఎగుమతులను సాధించింది. చైనా, వియత్నాంతో పాటు భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా భారత్ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతుండగా, ట్రంప్ తాజాగా భారతదేశంపై 50 శాతం, చైనాపై 30 శాతం, వియత్నాంపై 20 శాతం సుంకాలు విధించారు. చైనాలో అసెంబుల్ చేసిన US స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో తగ్గుదలలో ఎక్కువ భాగం భారతదేశం చేతిలో ఉంది.
భారతదేశంలో ప్రస్తుతం 300 మొబైల్ తయారీ యూనిట్లు ఉన్నాయి, ఒకప్పుడు 2014లో కేవలం రెండు మాత్రమే ఉండేవి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 26 శాతం స్థానికంగా తయారయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ డేటా ప్రకారం, దేశీయంగా తయారి 99.2 శాతానికి పెరిగింది. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ ప్రో మోడళ్లను తయారి, అసెంబుల్ చేయడం ప్రారంభించిన, ఇప్పటికీ ప్రో మోడళ్ల సప్లయ్ కోసం చైనాలోని తయారీ ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఆపిల్ మాత్రమే కాకుండా సామ్‌సంగ్, మోటరోలా వంటి కంపెనీలు కూడా భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులను పెంచాయి.