రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై.. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఆఫీస్ వర్క్ వరకు అంతా ఫ్రీ !

రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై.. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఆఫీస్ వర్క్ వరకు అంతా ఫ్రీ !

ఇప్పుడు ప్రపంచం అంతా డిజిటల్ సేవల వైపు పరుగులు తీస్తోంది. అన్ని సంస్థల నుంచి వ్యక్తిగత అవసరాల వరకు ఏదో ఒక రూపంలో డిజిటల్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే డిజిటల్ సేవలు అందిస్తున్న రైల్వే శాఖ.. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సదుపాయం కల్పించేకందుకు ముందుకు వచ్చింది. త్వరలో ఉచిత వైఫై అందుబాటులోకి వస్తుందని పార్లమెంటులో ప్రకిటించింది. 

దేశ వ్యాప్తంగా దాదాపు ముఖ్యమైన అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది రైల్వే మంత్రిత్వ శాఖ. మొత్తం 6 వేల 115 స్టేషన్లలో ఇక నుంచి ఫ్రీ వైఫై అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా.. రూరల్-అర్బన్ ఇండియా మధ్య ఉన్న డిజిటల్ గ్యాప్ ను పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. 

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం ఆపరేటర్లు 4G, 5G సేవలను అందిస్తున్నాయి. ప్యాసెంజర్స్ కూడా డేటా కోసం నెట్వర్క్స్ ను వినియోగిస్తున్నారు. దీని ఆధారంగా 6,115 స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలను అందించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. 

ఫ్రీ వైఫై సదుపాయంతో ప్యాసెంజర్లు HD వీడియోలు చూడవచ్చు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చునని అన్నారు. దీనికోసం ప్యాసెంజర్ వైఫై మోడ్ ఆన్ చేసుకుని రైల్ వైర్ (RailWire) వైఫై కి కనెక్ట్ కావాల్సి ఉంటుందని తెలిపారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

►ALSO READ | వాట్సాప్ కొత్త మోసం: ఓపెన్ చేసారో బ్యాంక్ అకౌంట్ సహా అన్ని దోచేస్తారు..

ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్ కతా, అహ్మదాబాద్ వంటి టయర్ 1 సిటీలతో పాటు టయర్2, టయర్ 3 సిటీలను కూడా కవర్ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంస్థ అయిన రైల్ టెల్ (Railtel) ద్వారా వైఫై సదుపాయం అందించనున్నట్లు చెప్పారు. గతంలో గూగుల్, టాటా కంపెనీలతో టైయప్ అయిన రైల్ టెల్.. ప్రస్తుతం సొంతంగా రైల్ వైర్ బ్రాండ్ పై పనిచేస్తోందని తెలిపారు. 

రైల్ టెల్ కు ఇంత పెద్ద భారీ కాంట్రాక్ట్ దక్కుతుండటంతో షేర్లలో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఎక్కువైంది. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయనే ఊహాగానాలతో వెంటనే రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేశారు. ఆ తర్వాతి రోజు ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది. లాంగ్ టర్మ్ లో లాభాలు పక్కా అనే హోప్ లో ఉన్నారు. అయితే రైల్ టెల్ ఏప్రిల్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్  నుంచి రూ.90.08 కోట్ల ఆర్డర్ గెలుచుకుంది. గత ఐదళ్లుగా రైల్ టెల్ షేర్లు ఇన్వెస్టర్లకు 140 శాతం లాభాలను ఇచ్చాయి.