ఇందిరమ్మ క్యాంటీన్లతో పేదలకు మేలు

ఇందిరమ్మ  క్యాంటీన్లతో పేదలకు మేలు

గండిపేట, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేస్తోన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్​ అన్నారు. శనివారం ఆరాంఘర్‌‌‌‌‌‌‌‌ బస్టాప్, కాటేదాన్‌‌‌‌‌‌‌‌ సిటిజన్‌‌‌‌‌‌‌‌ కాంటా వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. అల్పాహారం వడ్డించి ప్రజలతో కలిసి బ్రేక్‌‌‌‌‌‌‌‌పాస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం శుభపరిణామమన్నారు. ఇది పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఎన్‌‌‌‌‌‌‌‌.ధనుంజయ్, సరికొండ వెంకటేశ్, మసున వెంకటేశ్​, కాశీగారి యాదగిరి, బొల్లా వెంకటేశ్, ఓంప్రకాశ్​పాల్గొన్నారు.