Rajinikanth: హిమాలయాల్లో రజనీకాంత్.. మహా అవతార్ బాబాజీ గుహలో ధ్యానం.. అభిమానులతో సెల్ఫీలు

Rajinikanth: హిమాలయాల్లో రజనీకాంత్.. మహా అవతార్ బాబాజీ గుహలో ధ్యానం.. అభిమానులతో సెల్ఫీలు

“రజనీకాంత్..” (Rajinikanth) ఈ పేరు పక్కన సూపర్ స్టార్ అనే ట్యాగ్ లేకపోతే ఏ మాత్రం ఉహించుకోలేం. అలాంటి స్టార్ హీరో అసాధారణ జీవితాన్ని గడపడమంటే.. ఎంతటివారికైనా ఆశ్చర్యం వేస్తుంది. అంతటి సింప్లిసిటీ.. అనుకువ.. మర్యాద.. కనీసం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న హీరోల్లో కూడా ఆశించలేం. అది కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్లో మాత్రమే చూడగలం. ఆశించగలం.. ఆస్వాదించగలం. ప్రస్తుతం తలైవా కూలీ మూవీస్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే, జైలర్ 2 షూటింగ్లో సైతం బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో రజినీ సినిమాలకు కాస్తా విరామం ఇచ్చి ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్మమయ్యారు. ఇందులో భాగంగా అతడు రిషికేశ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించారు. ఆ తర్వాత మహా అవతార్ బాబాజీ గుహకు వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో రజినీ సాంప్రదాయ తెల్లటి దుస్తులు ధరించి.. ధ్యానం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఒక ఫొటోలో రజినీకాంత్ కళ్ళు మూసుకుని, మహా అవతార్ బాబాజీ గుహ లోపల లోతైన ధ్యానంలో నిమగ్నమయ్యారు. మరొక ఫొటలో చేతిలో కర్ర పట్టుకుని, మెట్లపై కూర్చుని ఉన్నారు. ఇటీవలే రోడ్డు పక్కన ఆగి, ఓ చిన్న హోటల్లో భోజనం చేస్తూ కనిపించారు. ఇపుడు గుహలో ధ్యానం చేస్తూ.. అక్కడి స్వామిజీతో ముచ్చటించడం వంటి ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతుండటం ఫ్యాన్స్ని ఖుషి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే రజనీ టీమ్ ఆ వీడియోను X లో షేర్ చేసి “హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ బాబాజీ గుహ సమీపంలోని శ్రీ బాబాజీ ఆశ్రమంలో స్వామీజీతో కలిసి దివ్య భోజనం చేశారు” అని రాశారు.

ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో 'జైలర్ 2' ఉంది. వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా ఉంది. ఆ తర్వాత మహారాజ డైరెక్టర్తో ఓ మూవీ, కమల్ హాసన్తో మరో మూవీ చేయనున్నట్లు సమాచారం. అతి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.