
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్గా నటించిన రీసెంట్ మూవీ కూలీ (COOLIE). ఆగస్టు 14న విడుదలైన ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో రూ.281 కోట్ల నెట్ వసూలు చేసింది.
ఈ క్రమంలో కూలీ థియేటర్ లాంగ్ రన్ కంప్లీట్ చేసుకుని, త్వరలో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది. ఇవాళ (సెప్టెంబర్ 4న) కూలీ ఓటీటీ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
కూలీ ఓటీటీ:
‘కూలీ’ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లు పెట్టి ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి కూలీ స్ట్రీమింగ్ కానున్నట్లు X వేదికగా సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
“దేవా, సైమన్, దహా సాగాతో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. కూలీ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో” అనే క్యాప్షన్తో ఓటీటీ వివరాలు తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. అంటే, మరో వారం రోజుల్లో తలైవా ఓటీటీ సంభవం మొదలవ్వనుంది.
get ready to vibe with the saga of Deva, Simon, and Dahaa 🔥#CoolieOnPrime, Sep 11@rajinikanth @sunpictures @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja pic.twitter.com/Erjtef2o0C
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025
‘కూలీ’ బాక్సాఫీస్:
‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో రూ.281 కోట్ల నెట్ వసూలు చేసింది. రాష్ట్రాల వారీగా వసూళ్లు చూస్తే.. సొంత భాష తమిళంలోనే అత్యధికంగా రూ.180 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో రూ.60 కోట్లు చేయగా, హిందీలో రూ.36 కోట్లు, కన్నడలో రూ.2.92 కోట్ల వసూళ్ళు సాధించింది.
ALSO READ : ఓటీటీలోకి వచ్చేసిన ‘కన్నప్ప’..
ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణంతో మూవీ రావడం విశేషం. అయితే, ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ మూవీ మాదిరిగానే, కథ, స్క్రీన్ ప్లే ఉండటంతో మేకర్స్ ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయినప్పటికీ, రజినీ స్వాగ్ తో రూ.500కోట్లకి పైగా వసూళ్లు చేసింది.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్గా పనిచేశారు.