
మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో కన్నప్ప కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. అయితే, చాలా మంది ఆడియన్స్.. కన్నప్ప ఓటీటీ రాకకోసం ఆసక్తిగా వెయిట్ చేస్తూ వస్తున్నారు. సినిమా రిలీజై దాదాపు రెండు నెలలు కావడంతో, ఎప్పుడెప్పుడా అనే క్యూరియాసిటీతో ఉంటూ వచ్చారు.
నేటితో ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఇవాళ (సెప్టెంబర్4న) ప్రైమ్ వీడియోలో కన్నప్ప స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓటీటీ వివరాలు వెల్లడించారు.
కన్నప్ప బాక్సాఫీస్ కలెక్షన్స్:
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ తెరకెక్కింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి బిగ్ స్టార్స్ నటించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి భారీగా నిర్మించాడు విష్ణు. కానీ, విష్ణు ఊహించిన దానికి భిన్నంగా షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి.
వరల్డ్ వైడ్గా కేవలం రూ.46 కోట్లకు పైగా గ్రాస్, రూ.31 కోట్ల ఇండియా నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో కన్నప్పతో హీరో విష్ణు భారీగా నష్టాలూ చవిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. థియేటర్లలో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో ఆసక్తిగా మారింది.
Glory ✨ Guts 🔥 Grandeur 🏹 all in one epic#KannappaOnPrime, Watch Now: https://t.co/xdkdIDqKTD@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @MsKajalAggarwal @arpitranka_30 @mukeshvachan @StephenDevassy @editoranthony @PDdancing… pic.twitter.com/Yp3ClxEyTT
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025
కన్నప్ప కథ:
పరమ నాస్తికుడుగా పెరిగిన తిన్నడు (మంచు విష్ణు) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తండ్రి నాథ నాథుడు (శరత్ కుమార్) మాటకు విలువ ఇచ్చే తిన్నడు, గూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడెం యువరాణి నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు.
ఈ క్రమంలో గూడెంను వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు తిన్నడు. నెమలి శివ భక్తురాలు కాగా, తిన్నడు మాత్రం శివుడిని నమ్మని నాస్తికుడు. అటువంటి తిన్నడి జీవితంలోకి రుద్ర (ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడికి పరమ భక్తుడైన కన్నప్పగా ఎలా మారాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.