కరోనా రిలీఫ్ ఫండ్ కు రజనీకాంత్ 50 లక్షలు విరాళం

V6 Velugu Posted on May 17, 2021

చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో బాధితులకు సహాయ చర్యల కోసం రజనీకాంత్ 50 లక్షలు విరాళమిచ్చారు. ఆదుకునే చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరివిగా విరాళాలివ్వాలంటూ సీఎం స్టాలిన్ పిలుపునకు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తోపాటు అన్ని రంగాల వారు స్పందిస్తున్నారు. రజనీకాంత్ సోమవారం ఉదయం స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. రజనీకాంత్ స్పందించడంతో హీరో విక్రమ్ కూడా స్పందించి తన వంతుగా 30 లక్షల రూపాయలు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. వీరిని అనుసరిస్తూ కోలీవుడ్ చిత్రపరిశ్రమ అంతా స్పందించడం మొదలుపెట్టింది. 

Tagged , tamilnadu today, chennai today, rajinikanth donation, corona relief fund tamilnadu, tamilnadu corona relief fund, rajanikanth donation

Latest Videos

Subscribe Now

More News