
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’, నెల్సన్ డైరెక్షన్‌లో ‘జైలర్ 2’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సెట్స్‌పై ఉండగానే రజినీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన ఎప్పట్నుంచో తెలుగు దర్శకులతో సినిమా చేయాలని ఇంటరెస్ట్ చూపిస్తుండగా, తాజాగా అలాంటి ప్రాజెక్ట్ ఒకటి సెట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం, అంటే సుందరానికి సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ.. రజినీకాంత్‌కు ఓ కథను వినిపించగా, ఆయనకు నచ్చడంతో ఓకే చేశారట.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. రీసెంట్‌గా తమిళ హీరో అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మేకర్స్.. ఈసారి రజినీకాంత్‌తో సినిమాను ప్లాన్ చేయగా, దానికోసం ఇప్పటికే పలువురు తెలుగు దర్శకులతో రజినీకి కథ వినిపించారట. ఫైనల్‌గా వివేక్ ఆత్రేయ చెప్పిన కథను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.