Ranijikanth: రజనీకాంత్ సినిమాకు అరుదైన గౌరవం

Ranijikanth: రజనీకాంత్ సినిమాకు అరుదైన గౌరవం

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన కాలా సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్దానికి సంబంధించిన 25 అద్భుతమైన చిత్రాల జాబితాలో కాలా సినిమా చోటు దక్కించుకుంది. ఈ మ్యాగజైన్ లో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక చిత్రంగా కాలా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ అధికారికంగా ప్రకటించింది.  

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. 21వ శతాబ్దంలోని నాలుగు భాగాల్లో ఒక భాగం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. మా దగ్గర ఉన్న 25 మంది ఉత్తమ సినీ విశ్లేషకులు ఈ జాబితాను రూపొందించారు. 2000-2024 మధ్య వచ్చిన సినిమాల్లో అత్యుత్తమమైన వాటిని, ఏడాదికి ఒక సినిమా చొప్పున ఎంపిక చేశారు.. అంటూ BFI తెలిపింది. అలా 2018 సంవత్సరానికి గాను ఇండియా నుండి రజినీకాంత్ కాలా చిత్రం ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అలా ఈ అరుదైన ఘనత సాధించిన సినిమాగా కాలా నిలిచింది. 

ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జై భీమ్ ఫేమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.